News February 3, 2025
జగిత్యాలలో కిడ్నాప్ కలకలం

జగిత్యాల చింతకుంట వాడలో పట్టపగలు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాపను ఓ జంట ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాప వాళ్లను చూసి ఇంట్లోకి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారు వారిని పట్టుకన్నారని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
CMకు భద్రాద్రి రామయ్య కళ్యాణ ఆహ్వానం

భద్రాచలంలో ఈనెల 27న జరగనున్న సీతారాముల తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను దేవస్థానం తరఫున అందజేశారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావు, అర్చకులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు పత్రికను అందజేసి కళ్యాణానికి ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో చర్చించారు.
News March 19, 2026
కొత్త పార్టీ.. కవితకు ఊరట

TG: పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ECకి కోర్టు సూచించింది. ఇక విచారణ సందర్భంగా EC సూచించిన లోపాలు సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక తప్పులు సరిచేసి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. కాగా కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఈసీ కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే.
News March 19, 2026
మంచిర్యాల: తండ్రి మందలించాడని వర్షిత సూసైడ్

తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్‌కు చెందిన వర్షిత(17) తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కేసు నమోదైంది.


