News February 3, 2025

వచ్చే నెల మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News November 6, 2025

VKB: సీఎం వెళ్లే రహదారే ఇలా ఉంటే.. ఎలా?

image

మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కాగా, VKB జిల్లాలోని రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరుచూ HYD – బీజాపూర్ రహదారిలో వెళ్తారని సీఎం వెళ్లే రహదారికే ఈ దుస్థితి ఉంటే.. స్థానిక ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

News November 6, 2025

చర్ల: ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. తాళ్లగూడెం ఠాణా పరిధిలోని అన్నారం, మరిమల్ల గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

News November 6, 2025

ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

image

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.