News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News March 8, 2026
కామారెడ్డి: మహిళా అధికారులే ఆదర్శం

కామారెడ్డి జిల్లాలో పలు శాఖల్లో ఉన్నత స్థానంలో మహిళలే అధికారులుగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ మహిళలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా జూనియర్ సివిల్ జడ్జి బట్టు దీక్ష, DLSA కార్యదర్శి నాగరాణి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎఫ్ఓ నిఖిత, డీడబ్ల్యూఓ ప్రమీల, డీసీపీఓ డా.స్రవంతి, హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.విద్య ఆదర్శంగా నిలుస్తున్నారు.
News March 8, 2026
మంచిర్యాల: సర్వేయర్ల కొరతతో నిలిచిపోతున్న సర్వే

మంచిర్యాల జిల్లాలో సర్వేయర్ల కొరతతో భూ సర్వే నిలిచిపోతోంది. మొత్తం 18 మండలాలు ఉండగా, కేవలం 8 మండలాలకే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు, మూడు మండలాల బాధ్యతలను అధికారులు అప్పగించారు. పిటీషన్ పెట్టుకున్న దరఖాస్తుదారుల భూముల సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్లు వచ్చిన వారికి విధులు, బాధ్యతలు అప్పగించలేదు. జిల్లాలో భూముల సర్వే నత్త నడకన కొనసాగుతోంది.
News March 8, 2026
యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో తెల్లాపూర్ విద్యార్థుల సత్తా

నిర్మాణ్ యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో రామచంద్రపురం మండలం తెల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అదరగొట్టారు. మాదాపూర్‌లో జరిగిన పోటీల్లో వీరు రూపొందించిన ‘ఆల్కహాల్ డిటెక్టర్’ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కినట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. 7వ తరగతి విద్యార్థులు కార్తీక్, శ్రీరామ్, 8వ తరగతి విద్యార్థులు శివానంద్, అగ్నిమణి ప్రతిభను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.


