News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 9, 2025
పీయూ న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు

పాలమూరు యూనివర్సిటీలో ఉన్న న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. మూడేళ్లు ఎల్ఎల్బీ కోర్సులో 2025-26 విద్యా సంవత్సరంలో రెండు సెక్షన్‌లలో కలిపి 60 మంది విద్యార్థుల చొప్పున తీసుకోవచ్చునని అనుమతి ఇస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేశ్ బాబు తెలిపారు.
News July 9, 2025
సిరిసిల్ల: కస్తుర్భా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

బోయినపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు పరిశీలించారు. పదో తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కిచెన్, స్టోర్ రూమ్, మధ్యాహ్న భోజనం తయారీ తీరును పరిశీలించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.