News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News July 4, 2025
రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.
News July 4, 2025
జగిత్యాల : రోశయ్య జయంతి సందర్భంగా SP ఘన నివాళి

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కె.రోశయ్య జయంతిని జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి SP అశోక్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు.
News July 4, 2025
లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.