News February 3, 2025
సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్: అశ్వినీ వైష్ణవ్
TG: కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. ‘సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో 1,026 కి.మీ. మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం నుంచి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని చెప్పారు.
Similar News
News February 3, 2025
ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా?: MLC కవిత
BCల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని, గతంతో పోల్చితే వారి జనాభా ఎలా తగ్గుతుందని MLC కవిత విమర్శించారు. ‘TGలో ఏ లెక్కన చూసినా 50-52% BCలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరం. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల BC జనాభా తేడా కనిపిస్తోంది. OCల జనాభా ఎక్కువ కనిపిస్తోంది. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీల, SC, ST జనాభా తగ్గుతుందా?’ అని ప్రశ్నించారు.
News February 3, 2025
డబ్బుల్లేక సన్యాసం తీసుకున్నా: మాజీ హీరోయిన్
ఆర్థిక కష్టాలతో తాను సన్యాసం తీసుకున్నానని మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి అన్నారు. ‘కిన్నెర అఖాడా మహామండలేశ్వర్ కోసం నేను రూ.కోట్లు ఇచ్చానంటున్నారు. నా వద్ద రూ.10cr కాదు కదా రూ.కోటి కూడా లేదు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలు సీజ్ చేసింది. చేతిలో రూపాయి లేకుండా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈమెను మహామండలేశ్వర్‌గా నియమించి వెంటనే బహిష్కరించిన విషయం తెలిసిందే.
News February 3, 2025
కోహ్లీని ఎలా ఔట్ చేయాలో బస్ డ్రైవర్ చెప్పాడు: సాంగ్వాన్
ఇటీవల రంజీ మ్యాచ్‌లో కోహ్లీని ఔట్ చేసిన H.సాంగ్వాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ తరఫున పంత్, కోహ్లీ ఆడతారనుకున్నాం. ఆ తర్వాత కోహ్లీ మాత్రమే బరిలోకి దిగుతున్నారని, మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మా బస్సు డ్రైవర్ విరాట్‌కు ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టంప్ బాల్ వేస్తే ఔట్ అవుతారన్నారు. కానీ నేను నా ప్లాన్ ప్రకారం బౌల్ చేశా’ అని చెప్పారు. ఈ మ్యాచ్‌లో విరాట్ 6పరుగులే చేశారు.