News February 3, 2025
తండ్రిని రెండు ముక్కలు చేయాలనుకున్నారు!

తండ్రికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఇద్దరు కొడుకులు పోటీ పడ్డారు. ఈక్రమంలో మృతదేహాన్ని గంటల తరబడి ఇంటి బయటే వదిలేశారు. చివరికి శవాన్ని 2 ముక్కలు చేసి చెరో ముక్కకు ఇద్దరు అంత్యక్రియలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ నిర్ణయం విని హడలిపోయిన స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు పెద్ద కొడుక్కి కర్మకాండ బాధ్యతల్ని అప్పగించారు. MPలోని టీకమ్ గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Similar News
News March 9, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రయల్ కోర్ట్ తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇటీవల వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.
News March 9, 2026
మిడిల్ ఈస్ట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: జైశంకర్

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై MEA జైశంకర్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మన ఇంధన అవసరాల విషయంలో మిడిల్ ఈస్ట్ కీలకమన్నారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని భారతీయ ఎంబసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.
News March 9, 2026
క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఉత్పత్తులివే!

క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్‌తో పాటు మానవాళి అవసరాలను తీర్చే మరెన్నో ఉత్పత్తులు తయారవుతాయి. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, మెరైన్ ఫ్యూయల్ లభిస్తాయి. అలాగే ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్స్ & రబ్బర్లు, డిటర్జెంట్స్(సబ్బులు), పెయింట్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఇంటి అవసరాల కోసం LPG, కొవ్వొత్తులు, వాసెలిన్, లిప్‌స్టిక్ తయారీలోనూ ఇది కీలకం. ముడి చమురు వేస్ట్‌తో తారు రోడ్లు వేస్తారు.


