News February 3, 2025
ఐనవోలు: భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం అమ్మవారి ఏకాదశ వార్షికోత్సవం, వసంత పంచమి సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి నవకలశస్నపన, పంచామృత, నవరస, సుగంధపరిమళ ద్రవ్యాభిషేకం, చండీహవనం, మహనివేదన, నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News April 3, 2026
ధురంధర్-2 సంచలనం.. ₹1,500 కోట్లు దాటిన కలెక్షన్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. రిలీజైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో ₹1,134 కోట్లు, విదేశాల్లో ₹367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.
News April 3, 2026
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం మిథిలా స్టేడియంలో కల్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జైశ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
News April 3, 2026
నాశనం చేయాలని చూస్తే శాసనం చేశాం: CBN

AP: అమరావతి రాజధానిని YCP నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని CM చంద్రబాబు అన్నారు. ‘అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయి. VJA-GNT మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ TDP సిద్ధాంతం. రాజధాని ఉంటేనే APకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశాం. నాకున్న అనుభవం వల్ల TGలోని 7 మండలాలను విలీనం చేయించాం’ అని తెలిపారు.


