News February 3, 2025
HYD: 8.5 లక్షల కనెక్షన్లకు ఉచిత నీటి పథకం

జలమండలి పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా.. వీటిలో 8.5 లక్షలు కనెక్షన్లు ఉచిత నీటి పథకంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ HYDలో అర్హులైన వారందరికీ ఉచిత నీటి పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఎవరికైనా అమలు కాకుంటే స్థానికంగా ఉన్న వాటర్ బోర్డుకు సంబంధించిన జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News March 27, 2026
భద్రాద్రి రామయ్య పెళ్లికి కోనసీమ కొబ్బరి బోండాలు

భద్రాచలం రామయ్య పెళ్లికి కోనసీమ కొబ్బరి బోండాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మండపేట గ్రామం నుంచి 24 ఏళ్లుగా రామయ్య పెళ్లిలో వినియోగించే కొబ్బరి బోండాలను రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు శంఖుచక్రాలు, తిరునామాలు, సీతారామ పేర్లతో అలంకరణ చేసి రామయ్య పెళ్లికి కానుకగా అందజేస్తున్నారు. కాగా శ్రేష్టమైన కొబ్బరి బోండాలను సేకరించి, నియమ నిష్ఠలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు.
News March 27, 2026
కృష్ణా: ఇంతేనా నిధులు.. MLAల అసంతృప్తి..!

ఉమ్మడి కృష్ణాలో సాగు, తాగునీటి కాలువల పూడికతీత పనుల నిధుల కేటాయింపు రాజకీయ దుమారం రేపుతోంది. క్షేత్రస్థాయి సమస్యల తీవ్రతతో సంబంధం లేకుండా, ప్రతి నియోజకవర్గానికి సరాసరి రూ.2.5 నుంచి 3.5 కోట్ల వరకు కేటాయించడంపై కొందరు MLAలే మండిపడుతున్నారు. ఇప్పటికే బడ్జెట్ ఖరారైందని, జిల్లావ్యాప్తంగా రూ.40 కోట్లతో ప్రాధాన్యత క్రమంలో పిచ్చిమొక్కల తొలగింపు, పూడికతీత పనులు చేపడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
News March 27, 2026
దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్రం ఏమందంటే?

దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. అది పూర్తిగా అసత్య ప్రచారం అని ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదనేమీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని పేర్కొన్నారు.


