News February 3, 2025
కీసరగుట్ట: 24 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఫిబ్రవరి 24 నుంచి 6 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఛైర్మన్ నారాయణ శర్మ తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో క్యూలైన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News January 20, 2026
SRPT: మహిళా సంఘాలకు రుణాల పంపిణీకి సిద్ధం కావాలి: కలెక్టర్

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో రుణాల పంపిణీపై పక్కా ప్రణాళికతో ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, కమిషనర్ హనుమంత రెడ్డి ఉన్నారు.
News January 20, 2026
ప్రకాశం: మద్యం ప్రీమియం స్టోర్‌కి దరఖాస్తులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 20, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


