News February 3, 2025
మేడ్చల్: ఇంటర్ పరీక్షల భయం ఉంటే కాల్ చేయండి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడి, పరీక్షల భయం, మానసిక సమస్యలపై పరిష్కారం చూపుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 24 గంటల పాటు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని, ఒత్తిడికి లోనైతే టోల్ ఫ్రీ నంబర్ 14416, 1800914416కు కాల్ చేసి తెలియజేయాలని సూచించారు. ధైర్యంగా పరీక్ష రాయాలని అధికారులు సూచించారు.
Similar News
News March 15, 2026
విద్యుత్ పునరుద్ధరణకు ‘ఎమర్జెన్సీ’ వాహనాలు: ఎస్ఈ

ఖమ్మం: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్’ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
News March 15, 2026
అన్నమయ్య: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్

రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో జరిగిన కృష్ణవేణి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీనివాసులును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కృష్ణవేణి బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుంటుండగా, కాపాడకపోగా శ్రీనివాసులును సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ సరిగ్గా వేసుకో అంటూ నవ్వుతూ వెటకారం చేశాడు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో సెక్షన్ 108 BNS కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 15, 2026
అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


