News March 19, 2024
విశాఖలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సబ్బవరం సీఐ

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 6, 2025
విశాఖ: ఎవరు ‘బుక్’అవుతారో?

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో విరాళాలకు సంబంధించిన రసీదుల బుక్ ఒకటి మిస్సైంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఆభరణాల లెక్కింపు జరగకపోవడంతో ఇటీవల విజయవాడ నుంచి వచ్చిన తనిఖీ బృందం అప్పటి నుంచి EOలుగా ఉన్న వారిని విశాఖకు పిలిపించి లెక్కలు వేసింది. స్టోర్ రూమ్‌లో ఉన్న 8వెండి వస్తువుల వివరాలు మినహా మిగతా ఆభరణాల లెక్కలు సరిపోయాయని తెలిపింది. వెండితో పాటు రసీదుల బుక్ మిస్సింగ్‌కు బాధ్యులెవరో తేల్చాల్సి ఉంది.
News September 6, 2025
విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ K.సందీప్ శుక్రవారం తెలిపారు. సెప్టెంబర్ 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 5, 2025
విశాఖలో ప్రతి నెలా ఒక ఈవెంట్: కలెక్టర్

విశాఖ పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు ప్రతినెలా ఒక ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఎంజీఎం మైదానంలో విశాఖ ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించగా ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖ హోటల్స్ 40 స్టాల్స్ ఏర్పాటు చేయగా భారీగా జనం హాజరయ్యారు.