News February 3, 2025
మంచిర్యాల BJP జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్‌గౌడ్

మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నంగునూరు వెంకటేశ్వర్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఎన్నికల నియామావళి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. జిల్లా ఎన్నికల అధికారి బద్దం లింగారెడ్డి ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్వర్ గౌడ్ నియామకం పట్ల BJP శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ మరింత బలపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 11, 2026
ఎంజీయూ M.Ed పరీక్షల షెడ్యూల్ విడుదల

నల్గొండ: ఎంజీయూ పరిధిలో M.Ed మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
News March 11, 2026
విశాఖ జిల్లాలో రికార్డ్ లెవల్లో రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
News March 11, 2026
టెన్త్ ఎగ్జామ్స్.. 19,835 మంది విద్యార్థులు: నల్గొండ DEO

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.


