News February 3, 2025

క్యాన్సర్ లక్షణాలు ఉంటే పరీక్షించుకోవాలి: దేశ్ పాండే

image

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి దేశ్ పాండే మాట్లాడుతూ.. రోజురోజుకూ వివిధ రకాలైన క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, తద్వారా నయం చేయవచ్చన్నారు.

Similar News

News March 12, 2026

రేపు రూ.155.27 కోట్లు జమ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధులను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2,65,040 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.106.02 కోట్లు, 2,46,262 మంది రైతులకు పీఎం కిసాన్ కింద రూ.49.25 కోట్లు విడుదల కానున్నాయి. ఈ రెండు పథకాల ద్వారా జిల్లాలోని రైతులకు మొత్తం రూ.155.27 కోట్ల ఆర్థిక సహాయం అందనుందని తెలిపారు.

News March 12, 2026

అమరావతిలో S+12 అంతస్తులతో 6 టవర్స్‌

image

అమరావతిలోని రాయపూడిలో AIS అధికారుల టవర్స్ నిర్మాణాన్ని APCRDA ఆధ్వర్యంలో కొనసాగిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో S+12 అంతస్తులతో 6 టవర్స్‌లో మొత్తం 144 విశాలమైన నివాస యూనిట్లు (సుమారు 3,500 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 12, 2026

చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

image

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.