News February 3, 2025
మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.
Similar News
News March 24, 2026
ఈసీ లెటర్‌లో బీజేపీ ముద్ర.. విపక్షాల ఆగ్రహం

కేరళంలో ఎలక్షన్ కమిషన్ లెటర్‌లో <<19459684>>బీజేపీ సీల్<<>> ఉండటంపై కాంగ్రెస్, CPM తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ‘ఇది పొరపాటు కాదు. తీవ్రమైన ప్రమాద సంకేతం. రాజ్యంగబద్ధ సంస్థ క్రెడిబిలిటీ, న్యూట్రాలిటీపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తులా ఎందుకు ప్రవర్తిస్తోంది? దీనికి జవాబుదారీ ఎవరు?’ అని కాంగ్రెస్ Xలో ప్రశ్నించింది. బీజేపీ, EC రెండూ ఒకే ముద్రను ఉపయోగిస్తున్నాయని CPM ఫైరయ్యింది.
News March 24, 2026
అమెరికాలో 40 శాతం పెరిగిన డీజిల్ ధరలు

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఆ దేశానికి ₹లక్షల కోట్లు ఖర్చవుతోంది. మరోవైపు డీజిల్ ధరలు 40 శాతం మేర పెరిగాయి. గ్యాలన్ ధర $5.29కు(ఒక గ్యాలన్=3.78 లీటర్లు) చేరుకుంది. 2022 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నుంచి రోజుకు 10-15 లక్షల బ్యారెళ్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా 30 లక్షలకు చేరుకోవచ్చన్నారు.
News March 24, 2026
ధురంధర్-2 ధమాకా.. ₹800కోట్లు దాటిన గ్లోబల్ కలెక్షన్లు

బాక్సాఫీసుపై ధురంధర్-2 దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో ₹430కోట్ల నెట్ వసూలు చేసి పుష్ప-2 హిందీ వెర్షన్ (₹425.10కోట్లు) రికార్డ్ బ్రేక్ చేసింది. ఐదురోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ ₹619.76కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ ₹829.76కోట్లకు చేరినట్లు Sacnilk తెలిపింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ధురంధర్-2 ₹1000కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా.


