News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి
గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News February 4, 2025
మేడ్చల్ జిల్లాలో రూ.29.56 కోట్ల రుణమాఫీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ఇప్పటి వరకు 4,371 మంది రైతులకు రూ.29.56 కోట్ల వరకు మేలు జరిగినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాలను అమలు చేసేందుకు పకడ్బండిగా చర్యలు చేపడుతున్నట్లుగా మేడ్చల్ కలెక్టర్ పేర్కొన్నారు.
News February 4, 2025
EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం
TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.
News February 4, 2025
కామారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల
కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు సొన్నైల తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.