News February 3, 2025

సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO

image

ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు  భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.

Similar News

News February 4, 2025

కామారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు సొన్నైల తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News February 4, 2025

కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే..

image

*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
*ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
*కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
*బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
*ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లొద్దు.

News February 3, 2025

ప్రైవేట్ స్కూళ్లపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం

image

AP: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.