News February 3, 2025
నూతన విద్యా పాలసీ రూపకల్పనపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా: కలెక్టర్

ఫిబ్రవరి 4 న నిర్వహించాల్సిన విద్యా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్టు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర నూతన విద్యా పాలసీ రూపకల్పనపై నిర్వహించవలసిన ప్రజాభిప్రాయ సేకరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సూచించారు. ప్రతి ఒక్కరు దీనిని గమనించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి ప్రకటన జారీ చేశారు.
Similar News
News April 19, 2026
మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్‌లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.
News April 19, 2026
HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.