News February 3, 2025

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.

Similar News

News November 9, 2025

మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

image

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

News November 9, 2025

లోక్ అదాలత్‌లో 18,000 కేసుల పరిష్కారం: రత్న ప్రసాద్

image

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు లోక్ అదాలత్ ద్వారా 18,000 కేసులను రాజీ చేశామని తెలిపారు. గత మూడు నెలల్లో మధ్యవర్తిత్వం ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి 200 కేసులను పరిష్కరించామని స్పష్టం చేశారు. అలాగే, గుర్తించిన 27 మంది అనాథ బాలలకు ఆధార్ కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 9, 2025

జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.