News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News March 22, 2026
మెదక్: KCR పై అభిమానం 2,155 K.Mల బైక్ యాత్ర

మెదక్ జిల్లా రేగోడ్‌కి చెందిన యువకుడు రాచోటి నిఖిల్, మాజీ CM KCRపై అభిమానంతో విశిష్ట బైక్ యాత్రను ప్రారంభించాడు. ఈ నెల 9న హిమాచల్ ప్రదేశ్‌లోని సంఘ టెన్జిన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. ఢిల్లీ మార్గంగా చైనా సరిహద్దు వరకు చేరుకొని గులాబీ జెండాను రెపరెపలాడిస్తూ తన అభిమానం చాటుకున్నారు. 2,155 K.M బైక్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
News March 22, 2026
శ్రీకాకుళం: కమర్షియల్ గ్యాస్ కొరత… మూతపడుతున్న హోటల్స్

శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస, పలాస కాశిబుగ్గ, ఇచ్చాపురం వంటి పట్టణాలు, నరసన్నపేట, పొందూరు వంటి ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత సమస్యగా మారింది. దీంతో హోటల్లో మూతపడుతున్నాయి. జిల్లాలో 400 వరకు హోటల్స్ ఉన్నాయి. హోటళ్ల సంక్షోభం అల్పాహారం, భోజనం కోసం ఆధారపడే వారితోపాటు, హోటల్లో పనిచేస్తున్న వారిపై సైతం ప్రభావం చూపుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
News March 22, 2026
TDR పాలసీలో కీలక మార్పులు

TG: భవన నిర్మాణాల్లో ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(TDR) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 21mకు పైబడిన భవనాలను హై-రైజ్ భవనాలుగా గుర్తించనుంది. 750-2000చ.మీ ప్లాట్లలో 18-21m భవనాలకు TDR తప్పనిసరి చేసింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్ బ్యాక్ సడలించింది. హై రైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్షేషన్‌కు, 2000 చ.మీ ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.


