News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News March 7, 2026
WGL: పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ నుంచి తెలంగాణ అధ్యక్షురాలిగా..!

వర్ధన్నపేటకు చెందిన స్వర్ణకు కాంగ్రెస్‌లో 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. స్వర్ణ నియామకంతో ఓరుగల్లు రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి. వర్ధన్నపేట, వరంగల్ తూర్పులో రాజకీయం మరింత వేడెక్కనుంది.
News March 7, 2026
ఆర్టీసీ ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలు: ఆర్ఎం

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు వరంగల్ RM విజయభాను తెలిపారు. హనుమకొండ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.
News March 7, 2026
WGL: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం.


