News February 3, 2025

ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

image

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.

Similar News

News February 4, 2025

తూ.గో: ‘మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి’

image

జిల్లాలో ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 13 మద్యం షాపులకు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారి చింతాడ లావణ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లా వ్యాప్తంగా 13 షాపులలో జిల్లాకలెక్టర్, బీసీవెల్ఫేర్‌ ఆఫీసర్, బీసీ కులసంఘాల ప్రతినిధుల సమక్షంలో తీసిన లాటరీలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్‌ కులానికి కేటాయించడం జరిగిందన్నారు.

News February 4, 2025

మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యం: ASF SP

image

జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురైనట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.

News February 4, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి రూ.2,16,551 ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.