News February 3, 2025
వికారాబాద్: సమస్యలకు సత్వరం పరిష్కారం: కలెక్టర్ ప్రతీక్

శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి 106 ఫిర్యాదులు రావడం జరిగిందని వివిధ శాఖల అధికారులు పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం చేయాలన్నారు.
Similar News
News January 14, 2026
అన్నమయ్య: భార్య మరణవార్త విని భర్త మృతి

‘ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి’ 60 ఏళ్ల కిందట వివాహ సమయంలో ఆ దంపతులు చేసిన ప్రమాణం ముందు మృత్యువు తలవంచింది. బి.కొత్తకోట (M) అమరనారాయణ పురానికి చెందిన అంజమ్మ(85),శ్రీరాములు(90)దంపతులు. వృద్ధాప్యం వరకూ అన్యోన్యంగా ఉన్నారు. మంగళవారం ఉదయం అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మృరణవార్త విన్న శ్రీరాములు కూడా కుప్పకూలి మృతి చెందాడు.
News January 14, 2026
HYD: ప్రముఖ రచయిత్రి ఇందిరాదేవి కన్నుమూత

దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ భార్య, ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్ గిర్ (96) HYDలోని గోషామహల్‌లో ఉన్న జ్ఞాన్ బాగ్ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య, కళా రంగాల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. అల్లా ఇక్బాల్, గాలీబ్, అరబిందో రచనల నుంచి ఇన్‌స్పైర్ అయిన ఇందిరా దేవి చిన్నప్పటి నుంచే రచనలపై ప్రేరణ పొందారు.
News January 14, 2026
బ్లాక్‌చైన్ భద్రతలో భూ రిజిస్ట్రేషన్లు

TG: భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రతను కల్పించనుంది. తొలుత ఫ్యూచర్ సిటీ భూముల కోసం ప్రత్యేక ‘హైడ్రా-లెడ్జర్’ వ్యవస్థను డిజైన్ చేసింది. దీంతో ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. డబుల్ రిజిస్ట్రేషన్లు వంటివి లేకుండా కొనే వారికి, అమ్మేవారికి పూర్తి భరోసా ఇచ్చేలా ఈ ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ‘వే2న్యూస్’కు వివరించారు.


