News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News March 5, 2026
చిత్తూరు: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జింక చలపతి (పుంగనూరు), బాబాజాన్ (పూతలపట్టు), మొగసాల కృష్ణమూర్తి (కుప్పం), వెంకటరెడ్డి యాదవ్ (పలమనేరు), మొగసాల రెడ్డప్ప (చిత్తూరు), రాహుల్ రాజారెడ్డి (నగరి), వల్లివేడు పృథ్వీ రెడ్డి (జీడి నెల్లూరు)కు పరిశీలకులుగా నియమించారు.
News March 5, 2026
రోజుకు 5 గంటలే తరగతులు.. మీరేమంటారు?

ఫిన్లాండ్ విద్యా విధానం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ విద్యార్థులు రోజుకు 4 -5 గంటలు మాత్రమే స్కూల్‌లో గడుపుతారు. ప్రతి పీరియడ్ తర్వాత 15 నిమిషాలు విరామం, తక్కువ హోంవర్క్ ఉండటం విశేషం. ఒత్తిడిలేని ఈ వాతావరణం పిల్లల్లో సృజనాత్మకతను, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందట. అంతర్జాతీయ PISA ర్యాంకింగ్స్‌లోనూ ఫిన్లాండ్ మంచి ఫలితాలు రాబడుతోంది. అక్కడ విద్య, భోజనం, రవాణా ఉచితం. ఈ విధానంపై మీ కామెంట్?
News March 5, 2026
నాగోల్: CM రేవంత్‌కు KTR వార్నింగ్

CM రేవంత్ ఇల్లు రెడ్డి కుంటలో ఉందని KTR అన్నారు. నాగోల్ STP పరిశీలన అనంతరం ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. CM సోదరుడి ఇల్లు కూడా దుర్గం చెరువులో ఉందని, మంత్రుల ఇండ్లు కూడా చెరువుల మధ్యలో ఉన్నాయని ఆరోపించారు. వాటిని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. అదే పేదవాడి భూమికి రిజిస్ట్రేషన్లు ఉన్నా కూల్చివేస్తున్నారని.. కానీ, పేదలు కుర్చి మడతపెట్టి కొట్టే రోజులు వస్తాయని CMకు KTR వార్నింగ్ ఇచ్చారు.


