News February 3, 2025
HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News March 18, 2026
భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కాదా: మంత్రి పొన్నం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఫైరయ్యారు. ‘BJP నుంచి 8 మంది MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు? రావాల్సిన నిధులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. భారత్‌లో TG అంతర్భాగం కాదా? నిధులు ఎందుకు కేటాయించరు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని BJP కేంద్ర నేతలు అంటే రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.
News March 18, 2026
WNP: బ్యాంకర్లు పూర్తిలక్ష్యాలను సాధించాలి

2025-26 వార్షిక ఆర్థిక ప్రణాళిక ప్రకారం బ్యాంకర్లు పూర్తిలక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఖాతాదారునికి పీఎం జీవనజ్యోతి బీమా యోజన, పీఎ సురక్ష బీమా యోజన కల్పించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.
News March 18, 2026
ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్‌కాల్<<>>, UPI యాప్స్‌ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.


