News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News December 25, 2025
గద్దెల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

మేడారం వనదేవతల గద్దెల విస్తరణ పనులు మరింత వేగం పెరగాలని, అవసరమైతే సిబ్బందిని పెంచి 24 గంటల్లో పనులు జరిపించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. జంపన్న వాగు స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాలు, రోడ్ల పనులను పరిశీలించిన మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొంగల మడుగు నుంచి జంపన్నవాగుకు వెళ్లే రోడ్డును మరమ్మతు చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.
News December 25, 2025
క్రిస్మస్ వేడుకల్లో రోజా

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి మున్సిపాలిటీ నత్తంకండ్రికలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించారు. యేసు ప్రభువు సూచించిన మార్గంలో అందరూ నడవాలని రోజా సూచించారు.
News December 25, 2025
NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం: కలెక్టర్

జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.


