News February 3, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 4, 2025
తూ.గో: ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభమవ్వాలి- కలెక్టర్
తీర ప్రాంతం దాటి ఉన్న ఇసుక రీచ్ తవ్వకాలు బుధవారం నుంచి ప్రారంభించేలా సమన్వయ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్‌లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 8,62,719 లభ్యత ఉందన్నారు.
News February 4, 2025
HYD: ఫోన్ వాడకం నుంచి పిల్లలని నియంత్రిస్తున్నారా?
రాచకొండ పోలీస్ విభాగం CP సుధీర్ బాబు ఆదేశాలతో, పిల్లల ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించేందుకు కీలక సూచనలు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని గమనిస్తూ, వారిని కొత్త వ్యక్తులతో మాట్లాడొద్దని పాఠాలు నేర్పాలని సూచించింది. అలాగే తల్లిదండ్రుల నియంత్రణ పద్ధతులతో అనుచిత కంటెంట్‌ను నిరోధించడం, వాడకపు సమయాన్ని పరిమితం చేయడం అవసరం అని తెలిపింది.
News February 4, 2025
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క
ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.