News February 3, 2025

సంగారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 4, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 04, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 4, 2025

ADB జిల్లా వాసికి ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డ్

image

క్యాన్సర్ వ్యాధి నివారణకు 10 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి డాక్టర్ ఉమాకాంత్ గౌడ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రొఫెసర్లు అవార్డుకు ఎంపిక కాగా.. అందులో ADBలోని శాంతి నగర్‌కు చెందిన ఉమాకాంత్ గౌడ్ ఉన్నారు. ఈనెల 4న కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ‌లో అవార్డు అందుకోనున్నారు.

News February 4, 2025

PPM: ప్రతికూల వార్తలపై అధికారులు తక్షణమే స్పందించాలి

image

జిల్లాలో సంస్థాగతంగా ప్రజలకు సేవలు అందించడంలో లోపాలు పట్ల వివిధ పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.