News February 3, 2025

నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 22, 2026

ADB: ఈ నెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.

News March 22, 2026

రైతుల కోసం టెలీ-మానస్ హెల్ప్ లైన్ : ADB కలెక్టర్

image

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.

News March 21, 2026

నార్నూర్: రూ.2,40,000 విలువగల గంజాయి స్వాధీనం

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్‌లో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్‌కు చెందిన బాలాజీ తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశారు. దాని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.