News February 3, 2025

వరంగల్ విద్యార్థికి ప్రపంచ రికార్డులో చోటు

image

వరంగల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న ఇమ్మడి అభిరామ్‌కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. స్కూల్లో సీనియర్ విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవంలో అభిరామ్ మహాభారతంలోని కర్ణుడి వేషాధరణలో 5 నిమిషాల 30 సెకన్ల పాటు అనర్గళంగా ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. ఈ ఏకపాత్రాభినయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసుకొని సూపర్ టాలెంట్ కిడ్ అవార్డుకు ఎంపిక చేశారు.

Similar News

News March 29, 2026

వరంగల్ బస్టాండ్‌లో తాగునీటి కష్టాలు!

image

వరంగల్ నగరంలో ఎండలు మండిపోతున్న తరుణంలో బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. బస్టాండ్‌లో కనీస మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్నా అధికారులు చలివేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉచిత తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

News March 29, 2026

జూన్‌లో వరంగల్ నూతన కలెక్టరేట్ ప్రారంభం!

image

వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం చిరునామా మారనుంది. అజం జాహి మిల్లు స్థలంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనం జూన్ నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టరు సత్యశారద భవనాన్ని సందర్శించి, ఏ అంతస్తులో ఏయే ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.