News February 3, 2025
సిరిసిల్ల ప్రజావాణిలో 122 దరఖాస్తులు

ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యానాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మొత్తం 122 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
Similar News
News July 4, 2025
ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. 2006 తర్వాత ఓ టెస్టులో తొలి 5 ఓవర్లలో 10 ERతో 50 రన్స్ ఇచ్చిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ బజ్ బాల్ ధాటికి ప్రసిద్ధ్ బలైపోయారు. పదే పదే షార్ట్ బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిద్ధ్ సహా మిగతా బౌలర్లూ పెద్దగా ప్రభావం చూపట్లేదు.
News July 4, 2025
శ్రీశైల మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శనం టోకెన్లు

జులై 1 నుంచి ప్రారంభమైన శ్రీశైలం మల్లన్న ఉచిత స్పర్శ దర్శన టోకన్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందొచ్చు. దేవస్థానం ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.inలో ఉచిత టోకన్లు పొందొచ్చని చెప్పారు.
News July 4, 2025
గద్వాల: రోశయ్య ఆర్థిక పరిపాలన ఆదర్శం: కలెక్టర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక పరిపాలనలో చూపిన సామర్థ్యం ఆదర్శణీయమని కలెక్టర్ బి.ఎం.సంతోశ్ అన్నారు. శుక్రవారం రోశయ్య జయంతి సందర్భంగా ఐడీఓసీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి, ఉపాధి, విద్య, వైద్యం, అభివృద్ధి లక్ష్యాలతో సమతుల రోడ్‌మ్యాప్ రూపొందించారని కొనియాడారు.