News February 3, 2025
పార్వతీపురం: ‘సైబర్ నేరాలపై దర్యాప్తు చేపట్టాలి’

సైబర్ నేరాలపై ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ టీం అధికారులతో సమావేశం నిర్వహించారు. సైబర్ టెక్నాలజీ మీద పోలీసు సిబ్బంది పరిణితి చెందేలా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News September 17, 2025
ములుగు: పెద్దలను స్మరించుకునే ‘కొత్తల’ పండగ

ఆదివాసీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు విభిన్నమైనవి. ప్రకృతితో మమేకమై వారు జరుపుకొనే పండుగల్లో కొత్తల(పెద్దల)పండుగ ఒకటి. సెప్టెంబర్‌లో ఉత్తర కార్తె మొదటి పాదం ప్రారంభమైన తర్వాత బుధ, గురువారాల్లో నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు కోడి, యాటపోతులు బలిచ్చి వనభోజనాలకు పోతారు. కొత్త ధాన్యాలు, సాక పోసి మొక్కుతారు. మరణించిన పెద్దలకు నైవేద్యం ఇస్తారు. నూతన వధూవరులకు తమ వంశంలో పూర్తి హక్కులు కల్పిస్తారు.
News September 17, 2025
KMR: మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే..

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి కోర్టు మంగళవారం రూ.21,000 జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తికి కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. ‘మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News September 17, 2025
కొత్తగూడెం: హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

ఓ హత్య కేసులో నిందితుడైన పల్లం సాయికుమార్‌కు పదేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్‌కు చెందిన బడికల సంతోష్‌ను సాయికుమార్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్య చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోర్టుకు ఆధారాలు సమర్పించగా, నేరం రుజువైనట్టు తేలింది. కేసు ఛేదించిన పోలీసులను SP అభినందించారు.