News February 3, 2025

కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మ‌ృతి

image

బైక్ ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడిన కుక్కునూరు మండలం నెమలి పేట గ్రామంలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఐతంరాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.

Similar News

News March 19, 2026

సిద్దిపేట: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది: మంత్రి వివేక్

image

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఉగాది పండుగ ప్రతీక అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనునిత్యం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News March 19, 2026

భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

image

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

News March 19, 2026

ఏలూరులో ఉగాది వేడుకల్లో కలెక్టర్

image

ఏలూరు గిరిజన భవన్‌లో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ వెట్రి సెల్వి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సంవత్సరమంతా ప్రజలందరికీ మంచి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.