News February 3, 2025

జనగామ:  5న కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5న రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కిసాన్ మేళాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 19, 2025

ప్రకాశం నూతన కలెక్టర్ టార్గెట్ ఇదేనా..!

image

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే వెలుగొండ పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా ఆయన తొలి జిల్లా పర్యటనను వెలుగొండ నుంచి ప్రారంభించడం విశేషం. వెలుగొండకు మంచి రోజులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

News September 19, 2025

సాయుధ పోరాటం ఆపబోం: మావోయిస్టులు

image

తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం’ అని ఇటీవల అభయ్(సోనూ) పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నానని సోనూ ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.

News September 19, 2025

విద్యార్థిని కొట్టిన హెచ్ఎం.. ఏలూరులో ఆందోళన

image

‘డీ’ అక్షరాన్ని సరిగ్గా పలకలేదన్న కారణంతో ఆరో తరగతి విద్యార్థి ఆహిల్‌ను ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొట్టిన ఘటన ఏలూరులోని తంగెళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు శుక్రవారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని, ఆయన పద్ధతి మారలేదని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.