News February 3, 2025
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం: ఎస్పీ

హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక సమయంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. ఒక్కరోజు ముందుగానే హిందూపురంలో పోలీసులతో సమావేశమై భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు ఎన్నికలు నిర్వహించామన్నారు.
Similar News
News November 8, 2025
NLG: పలువురు జడ్జీలకు స్థానచలనం

ఉమ్మడి నల్గొండలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. NLG జిల్లా కోర్టు 3వ అదనపు జడ్జి డి.దుర్గాప్రసాద్ నిజామాబాద్‌కు, MLG కోర్టు 5వ అదనపు జడ్జి జి.వేణు సికింద్రాబాద్‌కు, సీనియర్ సివిల్ జడ్జి బి.సుజయ్ HYD కోర్టుకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కోర్టులో పనిచేస్తున్న కెవి.చంద్రశేఖరరావు MLG కోర్టుకు, HZNR కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం.రాధాకృష్ణ చౌహన్ SRPT కోర్టు మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు.
News November 8, 2025
స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్ క్లెన్సర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలి. వారానికోసారి స్క్రబ్, ఆరెంజ్ పీల్స్ అప్లై చేయాలి. హైలురోనిక్ యాసిడ్, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.
News November 8, 2025
4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

ప్రధాని మోదీ కొత్తగా 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరన్పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.


