News February 3, 2025
తిరుపతిలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్

తిరుపతి పట్టణంలో 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News March 14, 2025
నా కొడుకు తర్వాత సపోర్ట్ చేసేది ఆ హీరోకే: రోహిణి

నటి రోహిణి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొడుకు తర్వాత తాను సపోర్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి హీరో నాని అని ట్వీట్ చేశారు. ‘కోర్టు’తో ప్రేక్షకులకు ఆసక్తికర కథను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు వేయగా మూవీని పలువురు ప్రముఖులు వీక్షించారు. కాగా రోహిణి, నాని కలిసి అలా మొదలైంది, అంటే సుందరానికి, జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో నటించారు.
News March 14, 2025
చింతలమానేపల్లి: వనదేవతలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్ట్

డబ్బా గ్రామంలో కొన్ని రోజుల క్రితం సమ్మక్క సారలమ్మలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన SI నరేశ్ విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ @ హరీశ్‌ను సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని సిర్పూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతడికి మతిస్థిమితం లేదని, ఎర్రగడ్డకు తరలించాల్సిందిగా తీర్పునిచ్చినట్లు వెల్లడించారు.
News March 14, 2025
ములుగు: సహజ రంగులను వినియోగించాలి: కలెక్టర్

ములుగు జిల్లా ప్రజలకు కలెక్టర్ దివాకర టీఎస్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరిని ఒక్కచోట చేర్చే హోళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను సహజ రంగులను వినియోగిస్తూ, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు.