News February 3, 2025

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సౌడ రమేశ్

image

 బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా సౌడ రమేశ్‌ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సౌడ రమేశ్ మాట్లాడుతూ.. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన రమేశ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News April 19, 2026

నల్గొండ: వివాహిత అనుమానాస్పద మృతి

image

నల్గొండ మండలం పానగల్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మాందాపురానికి చెందిన ఐశ్వర్య(19)కు, పానగల్‌కు చెందిన శివతో 6 నెలల క్రితమే వివాహమైంది. శనివారం ఆమె ఇంట్లో ఉరివేసుకుని విగతజీవిగా పడి ఉంది. అయితే, ఐశ్వర్యను ఆమె మామయ్యే హత్య చేసి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయిన కొద్ది కాలానికే కుమార్తె మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News April 19, 2026

RR: మహిళలకు ఫ్రీ బ్యూటీషియన్ శిక్షణ

image

చిల్కూరులోని SBI- RSETI ఆధ్వర్యంలో మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18- 45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 79819 51167 నంబరును సంప్రదించగలరు.

News April 19, 2026

మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

image

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.