News February 3, 2025

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

Similar News

News March 24, 2026

రాష్ట్రపతి నిలయంలో పోటీలు.. మెదక్ విద్యార్థుల ప్రతిభ!

image

హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండు బహుమతులు సాధించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సింహారెడ్డి తెలిపారు. ఉపన్యాస పోటీలో పూనం రాజ్ పురోహిత్ తృతీయ బహుమతి సాధించగా, నినాదాల(స్లోగన్స్) పోటీలో అభినయ్ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. విజేతలను కళాశాల అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.

News March 24, 2026

కక్ష ఉంటే నాపై తీర్చుకోండి: KTR

image

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని KTR అన్నారు. ACB <<19460633>>ఛార్జ్‌షీట్‌పై<<>> ఆయన స్పందించారు. ‘ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగం జరగలేదు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిగాయి. తప్పు చేయని అధికారులను ఎందుకు ఇరికించారు. కక్ష ఉంటే నాపై తీర్చుకోండి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ ‘లొట్టపీసు కేసు అయితే భయమెందుకు? ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని కౌంటరిచ్చారు.

News March 24, 2026

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ చేపట్టిన బోర్డు ఫలితాలను APR 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 8లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. సిలబస్ మారడం, సబ్జెక్టుల ఎలెక్టివ్ విధానం వల్ల పరీక్షలు విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల 30రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కాగా మే మొదటివారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది.