News February 3, 2025

ఈనెల 6 మంత్రి ఫరూక్ సమీక్ష

image

రాష్ట్రంలో న్యాయశాఖ సంబంధించిన పాలనాపరమైన వివిధ అంశాలపై ఈనెల 6వ తేదీన సమీక్ష చేస్తున్నట్లు సోమవారం మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచి ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణ విషయంపై కూడా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించడం జరుగుతుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు.

Similar News

News February 4, 2025

ఖమ్మం: ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగ్

image

తొమ్మిది మంది ప్రొబేషనరీ సబ్- ఇన్స్‌పెక్టర్లకు (సివిల్) ఐదు నెలల శిక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్‌లను కేటాయిస్తూ.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ట్రైనీ ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అప్పగించిన శాఖపరమైన భాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. 

News February 4, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 4, 2025

మెదక్: మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు

image

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.