News February 3, 2025
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ లకు డీటీలకు కేటాయించాలని ఆదేశించారు.
Similar News
News March 4, 2026
నెయ్యి సరఫరాలో చంద్రబాబు స్కామ్‌లు: జగన్

AP: CM చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్ Xలో విమర్శించారు. ‘TTD ఛైర్మన్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే CBN చర్యలు తీసుకోలేదు. అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను కాలరాశారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరికి మీదికి నెట్టారు. నెయ్యి సరఫరాను ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టి స్కామ్‌లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు’ అని ఆరోపిస్తూ <
News March 4, 2026
శాసనమండలిలో గందరగోళం

AP: మండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ గందరగోళానికి దారితీసింది. ఛైర్మన్ ఒకే అంశంపై 2 తీర్మానాలను చర్చకు అనుమతించడం సరికాదని మంత్రి నాదెండ్ల అన్నారు. అలా అనుమతిస్తే ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ను వినాలన్నారు. అందుకు ఛైర్మన్ మోషేను రాజు అనుమతించకపోవడంతో ఇలాంటి చెడు సంప్రదాయాన్ని కొత్తగా తీసుకురావద్దని నాదెండ్ల వ్యాఖ్యానించారు. దీన్ని ఛైర్మన్ ఖండించగా, ప్రభుత్వం ఆయనను అవమానిస్తోందని YCP ఆందోళనకు దిగింది.
News March 4, 2026
మిర్యాలగూడ: టీ ఆలస్యమైందని తల పగలకొట్టారు

ఆర్డర్ చేసిన టీ త్వరగా ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు టీ స్టాల్ యజమానిపై దాడికి దిగాడు. మిర్యాలగూడలోని టీ స్టాల్ వద్దకు వచ్చిన యువకుడు, టీ విషయంలో యజమానితో వాగ్వాదానికి దిగి క్షణికావేశంలో గ్లాసుతో తలపై కొట్టాడు. దీంతో యజమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


