News February 3, 2025
మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 26, 2026
ఆదిలాబాద్‌లో పోలీసుల నాకాబందీ

నేరాల నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై డీఎస్పీ జీవన్ రెడ్డి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాల పరిశీలన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపడానికి నాకాబందీ కార్యక్రమం నిర్వహించామన్నారు.
News March 26, 2026
రెడీగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.. జూన్ కల్లా మరో లక్ష: పొంగులేటి

TG: రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని, ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయిస్తామన్నారు. ఇళ్ల ఎంపిక కోసం గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు అధ్యక్షులుగా ఉంటారని, ఇందులో MLAల ప్రాతినిధ్యంపై ఆలోచిస్తామని తెలిపారు.
News March 26, 2026
అనంత: మీ ఊరిలో తాగునీటి సమస్యా? ఈ నంబర్‌కు కాల్ చెయ్!

అనంతపురం కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీవో నాగరాజు నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఫిర్యాదు చేసేందుకు 9550480972 సంప్రదించవచ్చన్నారు.


