News February 3, 2025
నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు
నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేట కలక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న అన్ని స్కూల్స్, సంక్షేమ హాస్టళ్లలలో మాత్రలు వేయించాలన్నారు.
Similar News
News February 4, 2025
కొండపాకలో సనీ నటుడు సుమన్
అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం గుండె సంబంధిత సమస్యలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంజీవని ఆసుపత్రి సేవలు అమోఘమని సినీ నటుడు సుమన్ అన్నారు. సోమవారం కొండపాకలోని సంజీవని ప్రశాంతి నికేతన్ శిశు హృదయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను సుమన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణితో కలిసి ఆయన సందర్శించారు. గుండె సంబంధిత చిన్నారులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
News February 4, 2025
అమరావతి రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి: నరేంద్ర పాటిల్
AP: ఈ ఏడాది JAN నాటికి విజయవాడ రైల్వే డివిజన్‌లో ₹4,856Cr ఆదాయం వచ్చిందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి ₹500Cr ఆదాయం సాధిస్తోందన్నారు. ₹2,545Crతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. దీంతో అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు.
News February 4, 2025
ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు
✒ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
✒ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
✒ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
✒ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
✒ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
✒ వరల్డ్ క్యాన్సర్ డే; ✒ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం