News February 3, 2025
బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు: ఆర్. కృష్ణయ్య

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని MP ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘KCR చేసిన సర్వేలో 52% BCలు ఉన్నారు. మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బీసీలు ఉన్నట్లు చూపిస్తోంది. BCల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు BCలకు అన్యాయం చేస్తున్నారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలి’ అని కోరారు.
Similar News
News March 21, 2026
JGL: మామిడి రైతులకు తప్పని నష్టాలు!

జగిత్యాల జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో మామిడి పంట ఒకటి. జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో మామిడి తోటల సాగు విస్తీర్ణం ఉండగా, సాధారణంగా ఎకరాకు 5–10 టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుంది. కానీ ఈసారి అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తెగుళ్లు పెరిగి మామిడి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఫలితంగా ఈసారి మామిడి పూత, పిందలు, కాయలు రాలిపోయి ఏకరాకు 3 టన్నుల లోపుగానే దిగుబడి వస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు.
News March 21, 2026
భక్తులకు అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.
News March 21, 2026
యశ్ దయాల్‌కు షాక్ ఇచ్చిన RCB!

మరో వారంలో IPL ప్రారంభం కానుండగా RCB కీలక బౌలర్ యశ్ దయాల్ ప్రాక్టీస్ క్యాంపులో కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. ఆయనపై రేప్ <<17189705>>ఆరోపణలు<<>> ఉన్న నేపథ్యంలో జట్టు నుంచి తప్పించి ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఇక టీమ్ ట్రావెల్ బస్సుపై యశ్ మినహా మిగతా ప్లేయర్లందరి ఫొటోలు ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. అటు దయాల్ గత నెల రహస్యంగా పెళ్లి చేసుకోగా ఇటీవల ఆ విషయం బయటికొచ్చిన విషయం తెలిసిందే.


