News February 3, 2025
చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

0-5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 38 వేల వరకు పెండింగ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.
Similar News
News April 22, 2025
కృష్ణాజిల్లాలో ఉత్కంఠత

పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. రేపు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
News April 22, 2025
కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.
News April 22, 2025
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.