News February 3, 2025
కోదాడ: తాగిన మైకంలో ఉరేసుకొని యువకుడి సూసైడ్

ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో జరిగింది. టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాలు.. కొండపల్లి జయంత్ (28) శిరీష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి జయంత్ తాగిన మైకంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 24, 2026
పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.
News March 24, 2026
13 నూతన అంబులెన్సుల కొనుగోలు.. టెండర్లకు ఆహ్వానం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మెరుగుపరిచేందుకు 13 నూతన అంబులెన్సులను కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ తిరుమాని శ్రీ పూజ తెలిపారు. నీతి ఆయోగ్ నిధులతో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో ఈ అంబులెన్సులు కొనుగోలు చేయనున్నారు. టెండర్ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.
News March 24, 2026
కదిరి సబ్ రిజిస్ట్రార్‌పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై సబ్ రిజిస్ట్రార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉ.11లోపు రిజిస్ట్రేషన్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆయన సూచించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


