News February 3, 2025

నవాబ్‌పేట్: రైతు దీక్ష విజయవంతం చేయాలి: దయాకర్ రెడ్డి

image

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా, రైతుల పక్షాన 5న నవాబ్‌పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నేతలు పాల్గొంటారన్నారు.

Similar News

News March 31, 2026

ప్రభాస్ బిజీబిజీ.. ఈ ఏడాదే ‘ఫౌజీ’?

image

‘రాజాసాబ్’ డ్యామేజ్ నుంచి బయటపడేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ‘ఫౌజీ’పై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఈ ఏడాదే రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీంతోపాటు ‘కల్కి-2’, ‘స్పిరిట్’ సినిమాల షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఆయన బిజీగా ఉంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

News March 31, 2026

దుర్గమ్మ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ చేతివాటం

image

AP: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ షమ్మీ దొంగతనానికి ప్రయత్నించాడు. ఆలయంలో సోమవారం కానుకలు లెక్కించారు. మూటల రూపంలో వచ్చిన కానుకల్లో డబ్బు, బంగారం, వెండి తీసి అందులోని వ్యర్థాలను తగలబెడతారు. వ్యర్థాలు వేసే చెత్త బుట్టతో షమ్మీ కిందకు వెళ్తుండగా బోర్డ్ సభ్యులు పరిశీలించగా రూ.1.30లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు లభించాయి. ఈవో స్పందించి అతనికి నోటీసులు ఇచ్చారు.

News March 31, 2026

WGL: 8,297 మందికి షాక్!

image

ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరిలో గరిష్ఠ వినియోగం కారణంగా 8,297 మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకం దూరమైంది. 200 యూనిట్ల పరిమితి దాటడంతో వీరికి జీరో బిల్లుల బదులు చెల్లింపులు తప్పలేదు. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మార్చిలో మరికొందరికీ జీరో బిల్లు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 4 రోజుల్లో బిల్లులు రానున్నాయి