News February 3, 2025
వీటి పూర్తి పేర్లు మీకు తెలుసా?

నిత్యం ఏదోచోట మనం వినియోగించే వస్తువుల కంపెనీల ఫుల్‌ఫామ్స్ చాలా మందికి తెలియదు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. TVS- తిరుక్కురుంగుడి వెంగారం సుందరం, SYSKA- శ్రీ యోగి సంత్ కృపా అనంత్, WIPRO- వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్, HDFC- హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, PAYTM- పే థ్రూ మొబైల్, MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
Similar News
News March 23, 2026
‘ధురంధర్-2’: 4 రోజుల్లోనే రూ.761కోట్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్- 2’ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.761కోట్లు(గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇండియాలోనే రూ.550కోట్లు రావడం విశేషం. తొలి 2,3 రోజులతో పోల్చితే నాలుగో రోజు(ఆదివారం) భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వీకెండ్‌లోపు రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.
News March 23, 2026
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: రేవంత్

TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. వారికి మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తామన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని వారికి సూచించారు.
News March 23, 2026
మూసీ ప్రక్షాళనపై సలహాలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

TG: మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘గుజరాత్‌లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించింది. HYDలో మూసీ అభివృద్ధికి రాజకీయ రంగు ఎందుకు? అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాం. నాకు చెప్పడానికి ఇబ్బందైతే మంత్రులతో కమిటీ వేస్తా. వాళ్లకైనా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని సూచించారు.


