News February 3, 2025

మేడ్చల్: దివ్యాంగులకు GOOD NEWS

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు మీసేవ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. వినికిడి సమస్య, శారీరక అంగవైకల్యం, మానసిక వైకల్యం ఉన్నవారికి సదరం సర్టిఫికెట్ అందించడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలు అందరు సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకోసం మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే చాలామంది ప్రయోజనం పొందినట్లు Xలో ట్వీట్ చేశారు.

Similar News

News November 7, 2025

దామోదరా.. ఎంజీఎం సంగతేంది..!

image

MGM ఖాళీలతో సతమతం అవుతోంది. మంత్రి దామోదర రాజ నర్సింహ కేవలం సూపరింటెండెంట్‌ను మార్చి, ఖాళీగా ఉన్న RMO పోస్టులను అత్యవసర విభాగం వారితో నడిపిస్తున్నారు. కొన్నేళ్లుగా RMO-1, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మంగళవారం కల్పించిన పదోన్నతులతో ప్రస్తుతం విధుల్లో ఉన్న డిప్యూటీ RMO-2 ఎం.వసంతారావు సంగారెడ్డి(D) వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. దీంతో ప్రస్తుతం 3 RMO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News November 7, 2025

KMR: ఇన్‌ఛార్జ్ DMHOగా డా.విద్య

image

కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.విద్య నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.రవీందర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తించిన డా.చంద్రశేఖర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వికారాబాద్ RMOగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో డా.విద్యను నిమయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News November 7, 2025

తిరుపతి, చిత్తూరులో పవన్ పర్యటన ఇలా..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ఉదయం 10 గంటలకు రేణిగుంటకు వస్తారు. మామండూరు అటవీ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేసి అదేరోజు రాత్రి విజయవాడ వెళ్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి పలమనేరు(ముసలిమడుగు) కుంకి ఏనుగుల క్యాంప్‌నకు చేరుకుంటారు.