News February 3, 2025
ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించిన రోజే సంతృప్తి: బాలయ్య

తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సంతృప్తి లేదని నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న వచ్చిన రోజే తనకు సంతృప్తి అని బాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్లో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News November 4, 2025
రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోతోపాటు కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.
News November 4, 2025
దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.
News November 4, 2025
‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.


