News February 4, 2025

EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం

image

TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.

Similar News

News March 12, 2026

IPL SPL: డిఫెండింగ్ ఛాంపియన్ RCB VS పవర్‌హౌస్ SRH

image

ఈసారి IPL తొలి పోరులో RCB, SRH జట్లు తలపడనున్నాయి. గత విజయాల ఊపులో RCB ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా.. రికార్డులు మాత్రం సన్‌రైజర్స్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకూ జరిగిన 24 మ్యాచుల్లో SRH 13, RCB 11 సార్లు గెలిచాయి. 2024లో 287 పరుగుల రికార్డు స్కోరుతో చెలరేగిన SRH ఈసారి ఏకంగా 300 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగుతుందనే చర్చ సాగుతోంది.

News March 12, 2026

సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

image

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.

News March 12, 2026

మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

image

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్‌ ఎంప్లాయీస్‌కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్‌‌లోని కేఫ్‌లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.